ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కార్యక్రమం ప్రారంభం
మద్దూరు నవంబర్28, ప్రజా వాణి,
మండలంలోని హనుమ తండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాదావత్ లలితా శ్రీనివాస్ నాయక్, ఉప సర్పంచ్ మోహన్ నాయక్ వార్డు సభ్యులు జాటోతు నరసింహ నాయక్, బానోతు రాజు నాయక్, నాయకులు బానోతు శంకర్ నాయక్, ఇస్లావత్ గోరియా నాయక్, రతన్ సింగ్,పాడియా రవి మరియు ఎంపీ ఓ మోహన్, గ్రామ పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శి, మహేందర్, గ్రామ పెద్దలు మరియు యువకులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.

