డ్రగ్స్ వద్దు.. భవిష్యత్తు ముద్దు.. పెద్దమడూరులో పోలీస్ కళాజాతతో అవగాహన

  జనగామ ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి): చిన్నపాటి సరదా కోసం మొదలయ్యే మత్తు అలవాటు, చివరకు జీవితాన్నే చీకటిమయం చేస్తుందని, కాబట్టి యువత డ్రగ్స్, గంజాయి జోలికి వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, జనగామ డీసీపీ రాజా మహేంద్ర నాయక్ సూచనలతో దేవరుప్పుల మండలం పెద్దమడూరులో గురువారం మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం జరిగింది. సర్పంచ్ పాసుగంటి గిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ కళాజాత బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాకారులు పాటలు,...