కోహెడ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన సీపీ రష్మి పెరుమాళ్
విధుల్లో క్రమశిక్షణ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి సిద్దిపేట పోలీస్ కమిషనర్ సిద్దిపేట జిల్లా,నవంబర్ 27 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా కోహెడ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలలో భాగంగా శుక్రవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు కోహెడ ఎస్ఐ అభిలాష్ సిబ్బందితో రిపోర్ట్ చేయగా, ఎస్సై నిర్వహించిన పరేడ్‌ను సీపీ పరిశీలించారు.అనంతరం పోలీస్ సిబ్బంది కిట్ ఆర్టికల్స్, పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ కేసులకు సంబంధించిన వాహనాలను తనిఖీ చేసి...