జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 27 (ప్రజావాణి):తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పింఛన్లు మంజూరైన 4,89,233 మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు, లబ్ధిదారులు సంబరాలు జరుపుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి గురువారం అచ్చంపేట బహిరంగ సభలో పింఛన్ల విడుదలను ప్రకటించి కొద్దిమందికి ధ్రువపత్రాలు అందజేశారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరి ఖాతాల్లోకి ప్రభుత్వం నగదును బదిలీ చేసింది.
అందులో భాగంగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దావేర అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జనగామ సూర్యాపేట రహదారి చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీరెడ్డిల చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, చేనేత, గీత కార్మికులు సహా వివిధ వృత్తిదారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. గతంలో పింఛన్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన అర్హులైన పేదలకు ప్రభుత్వం ఊరట కల్పిస్తూ నూతన పింఛన్లు మంజూరు చేసిందన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన కానుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చిందన్నారు. దేశంలోనే ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు కాసారాపు ధర్మారెడ్డి, మండల ఎస్టీ, బీసీ, మైనార్టీ, కిసాన్ సెల్ అధ్యక్షులు భూక్యా సజ్జన్, కాడబోయిన గణేష్, మహ్మద్ జాకీర్, సుధాకర్ రెడ్డి, మహిళా మండల అధ్యక్షురాలు కునుసోత్ సావిత్రి, నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు ఉప్పుల ప్రకాష్, మండల యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న, జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహ్మద్ షబ్బీర్, బోనగిరి యాకస్వామి, మొటికే చంద్రశేఖర్, విద్యాసాగర్, రెడ్డి రాజుల రమేష్, ఓడపెల్లి రవీందర్, చిలుకూరి చంద్రమౌళి, రాంచంద్రు నాయక్, జక్కుల గంగరాజు, తోటకూరి రమేష్, మహ్మద్ రసూల్, రతన్, ప్రభాకర్, సుధాకర్, యాదగిరి, నర్సయ్య, అంజయ్య, ఆయా గ్రామాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

