కొత్త పింఛన్ల నగదు జమ.. సీఎం, ఎమ్మెల్యే, ఝాన్సీరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 27 (ప్రజావాణి):తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పింఛన్లు మంజూరైన 4,89,233 మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు, లబ్ధిదారులు సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురువారం అచ్చంపేట బహిరంగ సభలో పింఛన్ల విడుదలను ప్రకటించి కొద్దిమందికి ధ్రువపత్రాలు అందజేశారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరి ఖాతాల్లోకి ప్రభుత్వం నగదును బదిలీ చేసింది. అందులో భాగంగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ఆదేశాల...