📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఅమ్మపేటలో నూతన చేతిపంపు ఏర్పాటు

అమ్మపేటలో నూతన చేతిపంపు ఏర్పాటు

📰 Generate e-Paper Clip

అమ్మపేటలో నూతన చేతిపంపు ఏర్పాటు

ముదిగొండ, నవంబర్ 27 (ప్రజా వాణి )

మండల పరిధిలోని అమ్మపేట గ్రామ బస్టాండ్ సమీపంలో, హనుమంతుని ఆలయం పక్కన ఉన్న గ్రామ పంచాయతీ బోరు వద్ద నూతన చేతిపంపును ఏర్పాటు చేశారు. శుక్రవారం గ్రామ సర్పంచ్ మేకపోతుల భద్రమ్మ చేతుల మీదుగా ఈ చేతిపంపును ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ భద్రమ్మ మాట్లాడుతూ.. బస్టాండ్ వద్ద ఉన్న పాత చేతిపంపులో భూగర్భ జలాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతన చేతిపంపును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులతో పాటు గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం కలుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మహిముద, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.