📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణబిస్లరీ వాటర్‌ బాటిళ్లలో క్యాన్సర్ కారక పదార్థాలు

బిస్లరీ వాటర్‌ బాటిళ్లలో క్యాన్సర్ కారక పదార్థాలు

📰 Generate e-Paper Clip

*బిస్లరీ వాటర్‌ బాటిళ్లలో క్యాన్సర్ కారక పదార్థాలు?*

*పరీక్షల్లో బ్రోమేట్, ఇతర రసాయనాలు ఉన్నట్లు గుర్తింపు.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రకటన*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 26 (ప్రజావాణి ):మంచాల బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లను పరీక్షించగా కొన్ని నమూనాల్లో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తించిందని ఒక వార్తా కథనం పేర్కొంది. దీంతో ఈ కంపెనీపై చట్టపరమైన చర్యలు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది.

తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నీటిలో నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువగా బ్రోమేట్ ఉన్నట్లు గుర్తించారని, అలాగే పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ రసాయనాలు ఆరోగ్యానికి హానికరమని, క్యాన్సర్ కారకాలుగా పరిగణిస్తారని వెల్లడించింది.

అయితే ఈ వార్తలో పేర్కొన్న వివరాలపై సంబంధిత అధికారుల నుంచి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. వినియోగదారులు తాగునీటి నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.