📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఆడబిడ్డకు పెద్దన్నలా సర్పంచ్ బర్మావత్ వివేక్

ఆడబిడ్డకు పెద్దన్నలా సర్పంచ్ బర్మావత్ వివేక్

📰 Generate e-Paper Clip

ఆడబిడ్డకు పెద్దన్నలా సర్పంచ్ బర్మావత్ వివేక్..!

కడావత్ అమృత పెళ్లికి రూ.5 వేల ఆర్థిక సాయం..!

తండ్రి లేని ఆడపడుచుకు సర్పంచ్ ఆర్థిక భరోసా..!

జల్లాపల్లి ఆబాదిలో ఇది ఐదవ ఆపన్నహస్తం..!

కోటగిరి (బాన్సువాడ)/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలంలోని జల్లాపల్లి ఆబాది గ్రామ సర్పంచ్ బర్మావత్ వివేక్ మరోసారి తన మాట నిలబెట్టుకున్నారు.గ్రామంలోని ప్రతి ఆడబిడ్డకు అండగా నిలుస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు గురువారం గ్రామానికి చెందిన వధువుకు రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి గ్రామస్థుల ప్రశంసలు అందుకున్నారు.గ్రామానికి చెందిన కీర్తిశేషులు పండు నాయక్ కుమార్తె కడావత్ అమృ త వివాహానికి సర్పంచ్ బర్మావత్ వివేక్ స్వయంగా హాజరై రూ.5,000 ఆర్థిక సాయాన్ని అందజేసి వధూవరులను ఆశీర్వదించారు.తండ్రి లేని ఆడబిడ్డ వివాహ సమయంలో సర్పంచ్ అందించిన ఈ ఆర్థిక భరోసా ఆ కుటుంబానికి ఎంతో అండగా నిలిచిందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ బర్మావత్ వివేక్ మాట్లాడుతూ.తాను అందిస్తున్న ఈ ఆర్థిక సహాయ కార్యక్రమంలో ఇది ఐదవ విడత (డొనేషన్) అని తెలిపారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తు న్నట్లు పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లను చిత్తశుద్ధితో అమలు చేస్తూ గ్రామంలో సరికొత్త పాలన కు శ్రీకారం చుట్టారంటూ ప్రజలు సర్పంచ్ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఖాజా గౌస్ ఉద్దీన్,గ్రామ పంచాయతీ కార్యదర్శి వినోద్ కుమార్,తండా పెద్దలు నాయక్ బర్మావత్ దేవిసింగ్,వార్డు సభ్యులు బర్మావత్ శేషారావు,జల్లాపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడావత్ ధనరాజ్,ఉపాధ్యక్షులు మతీన్,సోషల్ మీడియా కన్వీనర్ మహమ్మద్ ఖాన్ పఠాన్,మోహన్,డాక్టర్ ఆదిల్,జలీల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.