📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఎన్నికల భద్రతలో అప్రమత్తంగా ఉండాలి

ఎన్నికల భద్రతలో అప్రమత్తంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

ఎన్నికల భద్రతలో అప్రమత్తంగా ఉండాలి

పల్నాడు ఎస్పీ జగదీష్ ఆదహళ్లి

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 25 పల్నాడు జిల్లా

ఎన్నికల విధుల్లో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా సమన్వయంతో వ్యవహరించాలని పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఐపీఎస్ ఆదేశించారు.

నవంబర్ 26న నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో చైర్‌పర్సన్, 46 వార్డులకు, నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో 101 పంచాయతీలకు చెందిన 915 వార్డులకు జరగనున్న ఎన్నికల బందోబస్తుపై బుధవారం నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ దిశానిర్దేశం చేశారు.

ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట భద్రత కల్పించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100, 200 మీటర్ల పరిధిలో ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, అనుమతి లేని వ్యక్తులు, వాహనాలను అనుమతించరాదన్నారు.

మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.

ఎన్నికల నియమావళి, పోలీస్ యాక్ట్ 30, సెక్షన్ 163 నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, పోలింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఘర్షణలకు ఆస్కారం లేకుండా నిరంతర నిఘా కొనసాగించాలని స్పష్టం చేశారు.

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.