అర్ధరాత్రి దుప్పట్ల పంపిణీతో మానవత్వం చాటిన ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 25 (ప్రజావాణి): చలికాలంలో రోడ్ల పక్కన, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో నిద్రిస్తూ చలికి ఇబ్బందులు పడుతున్న నిరాశ్రయులు, యాచకులకు అండగా నిలిచేందుకు ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన "చలిని తరిమేద్దాం - దుప్పట్ల పంపిణీ కార్యక్రమం"లో భాగంగా జనగామ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో 45 దుప్పట్లు పంపిణీ చేశారు. జనగామ బస్టాండ్లో నివసిస్తున్న నిరాశ్రయులు, బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న అభాగ్యులు, రోడ్ల పక్కన నిద్రిస్తున్న నిరుపేదలకు, జనగామ రైల్వే స్టేషన్లో...