శ్రీ రేణుక ఎల్లమ్మ – జమదగ్ని కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మహాదేవుని శ్రీనివాస్
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 23 (ప్రజావాణి): కొమురవెల్లి మండలం మర్రి ముస్త్యాల గ్రామంలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ మంగళవారం హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ, శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, రైతులు పాడిపంటలతో వర్ధిల్లాలని, పంటలు సమృద్ధిగా పండి రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని...