**ఆరోగ్య కేంద్రానికి పరిశుభ్రత హంగులు.. వేలేరులో సర్పంచ్ ప్రత్యేక చొరవ!**
వేలేరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో వేలేరు మేజర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు.
సర్పంచ్ బిల్లా యాదగిరి చొరవతో, గ్రామ పంచాయతీ నిధుల ద్వారా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు, క్లీనింగ్ పనులు చేపట్టారు. రోగులకు, ఆసుపత్రికి వచ్చే ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ పారిశుద్ధ్య పనులను గ్రామ ఉపసర్పంచ్ శ్రీకర్, PHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మేఘన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ప్రశాంత్, సునీల్, హెల్త్ ఆఫీసర్ కుమారస్వామి, PHC సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

