📄 ePaper
5pm
7pm
Tuesday, November 24, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఇందిరమ్మ భీమ ప్రతి ఇంటికి ధీమా

ఇందిరమ్మ భీమ ప్రతి ఇంటికి ధీమా

📰 Generate e-Paper Clip

ఇందిరమ్మ భీమ ప్రతి ఇంటికి ధీమా

* వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్
* దేవులపల్లి యాదగిరి

సిద్ధిపేట ప్రతినిధి, నవంబర్ 24 (ప్రజావాణి)

ఇందిరమ్మ భీమ ప్రతి ఇంటికి ధీమా అని
నంగునూర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి పేర్కొన్నారు.
మంగళవారం రోజున మండల కేంద్రం తోపాటు మండలం లోని
రాంపూర్, బద్దిపడగ సిద్ధన్నపేట,
నాగరాజుపల్లి గ్రామాలలో
ఇందిరమ్మ జీవిత భీమ పథక నమోదు కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడారు.
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకం కొండంత భరోసా నిస్తుందని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హత గల ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం జిల్లాలో పకడ్బందీగా అమలు
చేయబడిందన్నారు.
దరఖాస్తు ఫారానికి ఎలాంటి తప్పులు లేకుండా పూరించాలని తెలిపారు. ఈ పథకం ద్వారా కుటుంబంలోని 18 నుండి 59 సంవ త్సరాల వరకు వయస్సు ఉన్న వ్యక్తి బీమా వ్యక్తిగా ప్రతి పాదించబడతారని, బీమా పొందే వ్యక్తి స్వయంగా దరఖాస్తుపై సంతకం చేసి, నామిని వివరాలను తెలియజేసి స్వయంగా అందించాలని తెలిపారు. స్వీక రించిన దరఖాస్తుల వివరాలను ఆన్ లైన్ పోర్టల్ లో స్పష్టంగా నమోదు చేయవలన్నారు .
ఈ పథకం కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా వర్తిస్తుందని, దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన అర్జీదారులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసి నామిని ఎంపిక విషయంలో సంబంధిత లబ్దిదారుల నుంచి భౌతికంగా సంతకాలు చేయడానికి, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశిం చారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ శ్రీనివాస్,సిద్దన్నపేట సర్పంచ్ సంగు పురేందర్,నాగరాజు పల్లి సర్పంచ్ ముక్కెర లింగం యాదవ్,
రాంపూర్ సర్పంచ్ గోక మహిపాల్ రెడ్డి, బద్దిపడగా సర్పంచ్ మంద లక్ష్మి, రాజు మాజీ ఎంపీటీసీ ఎనగందుల నితిన్ కుమార్, చెలికాని యాదగిరి,ఎస్సి సెల్ మండల అధ్యక్షులు రాగుల కృష్ణ,
ఎనగందుల యాదగిరి, బోడిగే శ్రీనివాస్,గుంటిపల్లి మాధురి సాయిరాం, దేవులపల్లి రాజు
ఉపసర్పంచ్ లు,చేర్యాల రాజు,
మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యాల యాదగిరి,కాంగ్రెస్ నాయకులు కందికట్ల రాజు బంగారు నర్సింలు పంగ రాజశేఖరరెడ్డి,పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.