📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణలక్ష్మీకాంతాపూర్‌లో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

లక్ష్మీకాంతాపూర్‌లో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

📰 Generate e-Paper Clip

లక్ష్మీకాంతాపూర్‌లో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

దండేపల్లి, నవంబర్ 22 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని లక్ష్మీకాంతాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదివారం ప్రారంభించారు. జిల్లా డీఆర్‌డీఓ, డీపీఓ కిషన్‌తో కలిసి ఆయన పంచాయతీ భవనాన్ని ప్రారంభించి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో గ్రామ పంచాయతీ కార్యాలయం కీలక పాత్ర పోషించాలని, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిలుకూరి మహేష్, ఎంపీడీవో జె.డి. ప్రసాద్, తహసీల్దార్ రోహిత్, లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, సింగిల్ విండో చైర్మన్ ముత్యాల శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా ఆర్‌జీపీఆర్‌ఎస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అనిత పాల్గొన్నారు.

అలాగే వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఉప సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.