*ఇల్లులేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు*
*ఇంటి నిర్మాణం పనులకు భూమిపూజా చేసిన సర్పంచ్ రాజ్ కుమార్*
జహీరాబాద్, నవంబర్ 22 (ప్రజావాణి): ఇల్లులేని వారు సొంత జాగా కలిగి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మాణం కోసం 5 లక్షల ఆర్థిక సహకారం అందిస్తుందని, నిర్మాణంలో భాగంగా 3 విడతల్లో బిల్లులను చెల్లింపులు చేస్తుందని సర్పంచ్ బ్యాగారి రాజ్ కుమార్ అన్నారు. లబ్ధిదారుల ఆహ్వానం మేరకు సర్పంచ్ టెంకాయ కొట్టి నూతన నిర్మాణం పనులకు భూమిపూజా చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, అన్నీ కార్డుల ప్రయోజనాలు ఒకే కార్డు ద్వారా లబ్ధిదారులకు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కార్డులను పంపిణి చేస్తుందని అన్నారు.

