మల్యాల నవంబర్ 23 (ప్రజావాణి): ఈ నెల 24న కొండగట్టు గిరిప్రదక్షిణ
పౌర్ణమిని పురస్కరించుకొని ఈ నెల 24న కొండగట్టు ఆంజనేయస్వామి వారి సన్నిధానం ఉన్న కొండచుట్టూ గిరిప్రదక్షణ చేసి స్వామివారి నిజరూపాన్ని చూసి వెళ్లామని గిరిప్రదక్షిణ నిర్వాహకులు సురేశ్ ఆత్మరామ్ అన్నారు. చందనోత్సవంలో భాగంగా 60 ఏళ్ల తర్వాత స్వామి వారిపై ఉన్న చందనాన్ని తొలగించి భక్తులకు నిజరూప దర్శనాన్ని కల్పిస్తున్న నేపథ్యంలో అంజన్న అసలు రూపాన్నిచూసి భక్తులు ఆనందంతోపాటు అనుగ్రహాన్ని పొందాలని కోరారు.

