📄 ePaper
5pm
7pm
Tuesday, November 24, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపెద్దకల్వల గ్రామానికి ప్రత్యేక పీఏసీఎస్ ఏర్పాటు చేయాలి

పెద్దకల్వల గ్రామానికి ప్రత్యేక పీఏసీఎస్ ఏర్పాటు చేయాలి

📰 Generate e-Paper Clip

పెద్దకల్వల గ్రామానికి ప్రత్యేక పీఏసీఎస్ ఏర్పాటు చేయాలి

పెద్దపల్లి సొసైటీ పరిధిలో కొనసాగించాలి.. రైతుల విజ్ఞప్తి

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి: నవంబర్ 23

పెద్దకల్వల గ్రామ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గ్రామాన్ని గతంలో మాదిరిగానే పెద్దపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) పరిధిలో కొనసాగించాలని గ్రామ రైతులు కోరుతున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా రైతులు తమ విజ్ఞప్తిలో పలు అంశాలను ప్రస్తావించారు.. పెద్దకల్వల గ్రామాన్ని తురుకల మద్దికుంట నూతన సొసైటీ పరిధిలో కలిపిన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి.
గతంలో మాదిరిగానే పెద్దకల్వల గ్రామాన్ని పెద్దపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) పరిధిలో కొనసాగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
ఒకవేళ పెద్దపల్లి పీఏసీఎస్‌ పరిధిలో కొనసాగించడం సాధ్యం కానిపక్షంలో, పెద్దకల్వల గ్రామంలోనే ప్రత్యేక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలి. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న కొత్తపల్లి, దస్తగిరిపల్లి, పెద్దబొంకూర్, నిట్టూరు, నిమ్మనపల్లి గ్రామాల రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. ఈ విషయంపై గ్రామ రైతులు, స్థానిక సదుపాయాలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని రైతులకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలి.గ్రామ రైతుల ప్రయోజనాలు, సహకార సంఘం ద్వారా అందే సేవలు, వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెద్దకల్వల గ్రామాన్ని పెద్దపల్లి పీఏసీఎస్‌ పరిధిలోనే కొనసాగించాలని లేదా గ్రామానికి ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేయాలని రైతులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. తమ విజ్ఞప్తిని పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమములో పర్శ సమ్మయ్య సాలెంద్ర రాములు కారుపాక సంపత్ నార్ల అంజయ్య వొద్నలా లక్ష్మయ్య కరెంగుల శ్రీనివాస్ పర్శ శ్రీరాములు ఆర్కే అరవింద్ నార్ల రాహుల్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.