కోతులనడుమకు రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ శివాలయం
లింగ సముద్రం చెరువు వద్ద ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన.. త్వరలోనే భూమిపూజ భిక్షాటన చేసైనా మహా యజ్ఞాన్ని పూర్తి చేస్తాం- గురుస్వామి కాల నాగ మహర్షి ఎల్కతుర్తి, నవంబర్ 23 (ప్రజావాణి): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామానికి అరుదైన ఆధ్యాత్మిక భాగ్యం దక్కనుంది. గ్రామంలో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో శ్రీ పశుపతినాథ్ శివాలయాన్ని అత్యంత వైభవంగా నిర్మించేందుకు గురుస్వామి కాల నాగ మహర్షి సంకల్పించారు. ఈ మేరకు ఆదివారం గ్రామానికి విచ్చేసిన గురుస్వామి కాల నాగ మహర్షి, వారి శిష్యులు...