కోటగిరిలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.
ఘనంగా భూమి పూజ నిర్వహించిన సర్పంచ్ బర్ల మధుకర్,అధికారులు.
మొదటి విడతలో 119,రెండో విడతలో 45 ఇళ్లు మంజూరు.
ప్రభుత్వానికి,సర్పంచ్,అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు.
కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు సోమవారం ఘనంగా శ్రీకారం చుట్టారు.మండల సర్పంచుల ఫోరం కన్వీనర్ బర్ల మధుకర్,ఎంపీడీవో జి.విష్ణు,హౌసింగ్ ఏఈ మాధవ రెడ్డి కలిసి రెండో విడత ఇళ్ల నిర్మాణానికి ముగ్గుపోసి భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా బర్ల మధుకర్, అధికారులు మాట్లాడుతూ.పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. కోటగిరి గ్రామంలో మొదటి విడత కింద 119 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు కాగా అవి వివిధ నిర్మాణ దశల్లో కొనసాగుతున్నాయని.వాటిలో ఇప్పటికే పలు ఇళ్లు పూర్తయి గృహ ప్రవేశాలు కూడా జరిగాయన్నారు. ప్రస్తుతం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా కోటగిరి గ్రామానికి మరో 45 ఇళ్లు మంజూరయ్యాయని. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందని.మంజూరైన లబ్ధిదారులు నిబంధనల ప్రకారం త్వరితగతిన నిర్మాణ పనులను ప్రారంభించి పూర్తి చేసుకోవాలని సూచించారు.తమ సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాని కి అలాగే సహకరిస్తున్న సర్పంచ్ బర్ల మధుకర్,అధికారుల కు ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కొట్టం మనోహర్,కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా కార్యదర్శి వహీద్,జీ.పి.కార్యదర్శి సందీప్,వార్డు సభ్యులు మేత్రి గంగాధర్,స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

