ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్..
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 23
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మంగలి అరుణ భాయి – పండరి దంపతుల నూతన ఇంటి నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ చేతుల మీదుగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అస్పత్వార్ అనిల్ కుమార్, ఉపసర్పంచ్ ఫయూమ్ ఖాన్, మాజీ సర్పంచ్ అస్పత్వార్ వినోద్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్, టీఆర్పీ జుక్కల్ నియోజక వర్గా అధ్యకుడు ఖండేరావు గ్రామ పెద్దలు సూర్యకాంత్ నాయక్ ప్రభు మహారాజ్ విఠల్ మహారాజ్ యువ నాయకులు రవీందర్ సంతోష్ తదితరులు పాల్గొని భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

