📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపస్రా పోలీసుల ఆధ్వర్యంలో 28న మెగా వైద్య శిబిరం

పస్రా పోలీసుల ఆధ్వర్యంలో 28న మెగా వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

పస్రా పోలీసుల ఆధ్వర్యంలో 28న మెగా వైద్య శిబిరం

ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క – గుత్తికోయల గూడేల్లో ఎస్ఐ తాజుద్దీన్ అవగాహన

గోవిందరావుపేట (ప్రజావాణి)

ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల *28-11-2026* న గోవిందరావుపేటలోని *పిఎస్ఆర్ గార్డెన్స్* లో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి *శ్రీమతి డా. ధనసరి అనసూయ (సీతక్క)* గారు హాజరు కానున్నారు.

ములుగు జిల్లా కలెక్టర్ *శ్రీ భోర్కడే హేమంత్ సహదేవరావు, ఐఏఎస్* గారు, ఎస్పీ *శ్రీ కేకన్ సుధీర్ రామ్ నాథ్, ఐపీఎస్* గారి ఆధ్వర్యంలో ఈ శిబిరం జరగనుంది.

*ఈ శిబిరంలో అందే సేవలు:*

*1.* జనరల్ హెల్త్ చెకప్
*2.* బీపీ & షుగర్ టెస్టులు
*3.* కంటి పరీక్షలు
*4.* దంత పరీక్షలు
*5.* మహిళల ఆరోగ్య సేవలు
*6.* పిల్లల ఆరోగ్య సేవలు
*7.* ఎముకలు & కీళ్ల పరీక్షలు (ఆర్థోపెడిక్)
*8.* డాక్టర్ల సూచన మేరకు ఉచిత మందులు

*గుత్తికోయల గూడేల్లో అవగాహన:*

ఈ శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పస్రా సీఐ దయాకర్, ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రాజెక్ట్ నగర్ గుత్తికోయల నివాస ప్రాంతంలో పర్యటించి అవగాహన కల్పించారు.

కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని, శిబిరానికి తప్పక రావాలని సూచించారు. హైదరాబాద్, వరంగల్ నుంచి వైద్య నిపుణులు వస్తున్నారని తెలిపారు.

తీసుకురావాల్సినవి:

1. పాత మెడికల్ రిపోర్టులు

2..ప్రస్తుతం వాడుతున్న మందులు & డాక్టర్ ప్రిస్క్రిప్షన్

శాంతిభద్రతలే కాదు.. ప్రజారోగ్యం కూడా మా బాధ్యత

పోలీసులంటే కేవలం నేరాల అరికట్టడం మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కూడా తమ బాధ్యత అని పస్రా పోలీసులు మరోసారి చాటుతున్నారు. మారుమూల గిరిజన గూడేల ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ చేస్తున్న ఈ కృషిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.