📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణJangaonపోకల జమున లింగయ్య మనవడి వివాహ వేడుకకు హాజరైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

పోకల జమున లింగయ్య మనవడి వివాహ వేడుకకు హాజరైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

📰 Generate e-Paper Clip

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20(ప్రజావాణి): జనగామ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ పోకల జమున లింగయ్య మనవడి వివాహ మహోత్సవం జనగామ పట్టణంలోని పిఎల్ జె కన్వెన్షన్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది.

ఈ శుభకార్యానికి మాజీ మంత్రి, పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు విచ్చేసి నూతన వధూవరులను ఆప్యాయంగా పలకరించి, అక్షింతలు వేసి వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా నూతన దంపతుల వైవాహిక జీవితం ఆనందమయం కావాలని, జీవితంలో ప్రతి అడుగులో పరస్పర ప్రేమాభిమానాలతో, అనురాగ ఆప్యాయతలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

నూతన వధూవరులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరిసంపదలతో, సుఖసంతోషాలతో కలకాలం అన్యోన్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.