జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20(ప్రజావాణి): జనగామ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ పోకల జమున లింగయ్య మనవడి వివాహ మహోత్సవం జనగామ పట్టణంలోని పిఎల్ జె కన్వెన్షన్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది.
ఈ శుభకార్యానికి మాజీ మంత్రి, పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు విచ్చేసి నూతన వధూవరులను ఆప్యాయంగా పలకరించి, అక్షింతలు వేసి వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా నూతన దంపతుల వైవాహిక జీవితం ఆనందమయం కావాలని, జీవితంలో ప్రతి అడుగులో పరస్పర ప్రేమాభిమానాలతో, అనురాగ ఆప్యాయతలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
నూతన వధూవరులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరిసంపదలతో, సుఖసంతోషాలతో కలకాలం అన్యోన్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.