ఎల్ నినోను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రజా ప్రభుత్వానికి ప్రసాదించాలని కొండగట్టు ఆంజనేయ స్వామిని వేడుకున్నట్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. శుక్రవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణలతో కలిసి 60 ఏళ్లకు ఒకసారి జరిగే స్వామివారి చందనోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కరువు నివారణకు ప్రభుత్వం చేసే సూచనలను ప్రజలు పాటించాలని కోరారు. సీఎం సహకారంతో కొండగట్టు అభివృద్ధికి ప్రత్యేక నిధులు సాధిస్తామని స్పీకర్, మంత్రి స్పష్టం చేశారు.

