*పారిశుధ్య కార్మికురాలి పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి— సిఐటియు*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
నలగొండ నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలు గా పనిచేస్తున్న చందుపట్ల రమణమ్మ పై చేసిన దాడిని ప్రజలు ప్రజాతంత్ర వాదులు ఖండించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం డి సలీం విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికురాలు పై జరిగిన దాడిని ఖండిస్తూ సుభాష్ విగ్రహం నుండి మైసయ్య విగ్రహం, ప్రకాశం బజార్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, రాష్ట్రపతి రోడ్డు, మీదుగా పెదగడియారం, మున్సిపల్ పార్క్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. మున్సిపల్ పార్క్ దగ్గర జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఉదయం ఐదు గంటలకే విధుల్లో చేరి ఇంటింటికి చెత్త సేకరణ చేస్తున్న క్రమంలో 45 వ డివిజన్ ఆనంద్ నగర్ నివాసి బాలకృష్ణ అనే వ్యక్తి ఇసుక మట్టి మూట తెచ్చి ట్రాక్టర్ పై ఉన్న రమణ నువ్వు తీసుకోమని అనగా మా వాళ్లు వస్తున్నారు ఆగండి అది బరువు ఉన్నది మోయలేము అని చెప్పడంతో జీతాలు తీసుకుంటున్నది —-అంటూ బూతులు తిడుతూ కులం పేరుతో తిడుతూ ఇంటిలోకి వెళ్లి కర్ర తీసుకొచ్చి కొట్టడం జరిగిందని అన్నారు. కొట్టిన బాలకృష్ణపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల పట్ల చిన్న చూపుతో ప్రజాప్రతినిధులు వ్యవహరించడం వలన ప్రజలలో చులకన భావన ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మలినాలు ఎత్తిపోసి చెత్తా చెదారం లేకుండా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న మున్సిపల్ కార్మికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. దాడికి గురైన రమణమ్మకు ప్రైవేట్ లో వైద్యం చికిత్స చేయించాలని, నష్టపరిహారం చెల్లించాలని పూర్తిగా ఆరోగ్యంగా కోలుకొని విధులకు చేరేవరకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నవంబర్ 21 22 23 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ ప్రాంతాలలో మున్సిపల్ కార్మికుల నిరసన ప్రదర్శనలు ఉంటాయని కార్మికుల పై దాడులకు పాల్పడితే తగిన శిక్షలు విధించే వరకు ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
*కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున*
మాట్లాడుతూ 90 శాతం మున్సిపాలిటీలో పరిశుద్ధ కార్మికులుగా దళితులు పేదలు పనిచేస్తున్నారని వారిని కులం పేరుతో దూషిస్తూ అవమానపరచడాన్ని కెవిపిఎస్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు రమణమ్మ పై దాడి చేసిన బాలకృష్ణ, అతని తల్లిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్మికులారా రమణమ్మ ను పరామర్శించి ధైర్యం కల్పించాలని నిందితులను కఠినంగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని వారు అధికారులు ప్రజా ప్రతినిధులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ కెవిపిఎస్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి గాదె నరసింహ గుండాల నరేష్ అద్దంకి నరసింహ బొల్లు రవీందర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చింతకాయల సంతోష్, పట్టణ కార్యదర్శి పెరిక కృష్ణ, పందుల లింగయ్య, కృష్ణవేణి, నాగుల కరుణ, కత్తుల పద్మ, రమేష్, లతీఫ్, ఎర్ర శీను తదితరులు పాల్గొన్నారు.

