📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్ఎల్‌నినో పరిస్థితుల్లో తక్కువ నీటితో పండే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి వ్యవసాయ అధికారులు

ఎల్‌నినో పరిస్థితుల్లో తక్కువ నీటితో పండే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి వ్యవసాయ అధికారులు

📰 Generate e-Paper Clip

*రైతులకు ఖేత్ బచావో అభియాన్‌పై అవగాహన*

*భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం చేయాలి – వ్యవసాయ శాఖ*

*ఎల్‌నినో పరిస్థితుల్లో తక్కువ నీటితో పండే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి*

మేడ్చల్ (ప్రజావాణి):- ఎల్లంపెట్ మున్సిపల్ పరిధిలోని హాయ్ సైదోని గడ్డ తండాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు నేల ఆరోగ్య పరిరక్షణ, భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై ఖేత్ బచావో అభియాన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు భూసార పరిరక్షణ, భూసార పరీక్షల ప్రాముఖ్యత, భూసార ఆరోగ్య కార్డుల ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగం, సేంద్రియ ఎరువుల ప్రాధాన్యత, పంట అవశేషాల నిర్వహణ, సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ, నీటి సంరక్షణ, పంటల వైవిధ్యీకరణ, ప్రకృతి వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు నీటి వినియోగాన్ని తగ్గించే పంటలు, స్వల్పకాలిక పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ అధికారులు సూచించారు. ఈ యాసంగిలో వరి సాగుకు బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల పంటలను సాగు చేసేందుకు మొగ్గు చూపాలని కోరారు. రసాయన ఎరువులు, పురుగుమందులను అవసరానికి మించి వినియోగించకుండా, భూసార పరీక్షల ఆధారంగా వ్యవసాయ శాఖ సిఫారసు చేసిన మోతాదుల్లోనే వాడాలని తెలిపారు. తద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, పెట్టుబడి ఖర్చులను తగ్గించి, స్థిరమైన వ్యవసాయం సాధించవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎల్లంపేట్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ శ్రీదేవి, కౌన్సిలర్ రజిత, మండల వ్యవసాయ అధికారి మాధవ్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు తేజస్విణి, రమేష్, రాజేందర్‌తో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.