📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్అత్వెల్లిలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం

అత్వెల్లిలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం

📰 Generate e-Paper Clip

*అత్వెల్లిలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం*

*నక్షత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.. పాల్గొన్న నాయకులు*

మేడ్చల్ :- పూడూర్–కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని అత్వెల్లిలో నక్షత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నక్షత్ర యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రొయ్యపల్లి సాయి చరణ్ గౌడ్ ఆహ్వానం మేరకు ఈ పూజా కార్యక్రమంలో పలువురు పాల్గొని అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి పూజలు చేసి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ప్రార్థించారు. అయ్యప్ప స్వామి భక్తులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి నామస్మరణ చేశారు. నక్షత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు యువతలో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాకట ప్రేమ్ దాస్, రాఘవ రెడ్డి, ఈశ్వర్ పలువురు నాయకులు స్థానిక యువకులు, అయ్యప్ప భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.