📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణJangaonరాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ప్రతి కుటుంబానికి...

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

📰 Generate e-Paper Clip

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి): ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పిస్తున్నట్లు *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి* తెలిపారు.

శుక్రవారం, పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు, పరిణయ కాలనీలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు.

ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించవచ్చని తెలిపారు. కుటుంబాన్ని పోషించే యజమాని అనుకోని పరిస్థితుల్లో మరణించినప్పుడు, ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా సహాయం అందించి, భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.

ఈ వార్డు పరిధిలో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయనే వివరాలను మున్సిపల్ కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో నమోదు రిజిస్టర్లను పరిశీలించి, బీమా పథకం కింద నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరి వివరాలను రిజిస్టర్లలో నమోదు చేసి వారి సంతకాలను తీసుకోవాలని సూచించారు. అలాగే డేటా నమోదులో ఎలాంటి తప్పులు దొర్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

లబ్ధిదారుల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించి దిశానిర్దేశం చేశారు. లబ్ధిదారుల ఆధార్ నంబర్లు, మొబైల్ నంబర్లను ఒకటికి రెండుసార్లు పరిశీలించి, నమోదు చేసిన వివరాలను వారికి చదివి వినిపించాలని అధికారులను ఆదేశించారు. క్యాంపులో అవసరమైన సామగ్రిని సమకూర్చుకోవాలని సూచించారు.

నమోదుకు వచ్చే ప్రజలకు టోకెన్లు జారీ చేయాలని, డేటా నమోదు చేసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భద్రపరచాలని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కోసం గ్రామ పంచాయతీల్లో, పట్టణ ప్రాంతాల్లోని మున్సిపల్ కార్యాలయాలు, వార్డుల్లో ప్రత్యేక క్యాంపు శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఈ క్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో నమోదు చేసుకున్న కుటుంబ యజమాని అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే, వారి నామినీలకు రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ బీమా పథకాల్లో ఉన్నవారు కూడా కొనసాగుతారని, కుటుంబాన్ని పోషించే 18–59 ఏళ్ల వయసు గల సభ్యులకు ఈ పథకంలో నమోదు చేసుకునే అవకాశం కల్పించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో బాలరామ రావు, జనగామ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.