📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లులు చెల్లించాలి

ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లులు చెల్లించాలి

📰 Generate e-Paper Clip

ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లులు చెల్లించాలి

బీజేపీ జిల్లా నాయకులు బాద నరేష్ డిమాండ్

ముస్తాబాద్, ప్రజావాణి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు రావాల్సిన చివరి విడత బిల్లులు వెంటనే చెల్లించాలని బీజేపీ జిల్లా నాయకులు బాద నరేష్ డిమాండ్ చేశారు.
మొదటి విడతలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఇప్పటికీ చివరి బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మొదటి విడత లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించకుండానే ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని చేపట్టడం సమంజసం కాదని ప్రశ్నించారు.ప్రభుత్వం ముందుగా మొదటి విడత లబ్ధిదారులకు రావాల్సిన బకాయి బిల్లులను తక్షణమే విడుదల చేసి వారి ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు బీజేపీ వారి పక్షాన నిలబడి పోరాడుతుందని, అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.