📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపెరిగిన బియ్యం ధరలను తక్షణమే నియంత్రించాలి

పెరిగిన బియ్యం ధరలను తక్షణమే నియంత్రించాలి

📰 Generate e-Paper Clip

పెరిగిన బియ్యం ధరలను తక్షణమే నియంత్రించాలి

రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి.. సీపీఐ డిమాండ్

ప్రజావాణి నవంబర్ 19

బహిరంగ మార్కెట్లో రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలను తక్షణమే నియంత్రించాలని, రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు అన్ని రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) కమలాపూర్ మండల సమితి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు నవంబర్ 18న హనుమకొండ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ధర్నాలో భాగంగా కమలాపూర్‌లో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలను నియంత్రించాలని, కృత్రిమ కొరత సృష్టిస్తూ అక్రమంగా నిల్వలు చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు పప్పులు, వంటనూనె, చక్కెర, చింతపండు తదితర నిత్యావసర సరుకులను సబ్సిడీ ధరలకు పంపిణీ చేయాలని కోరారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

తహసీల్దార్ ఈ ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి వినతిపత్రంలోని డిమాండ్లను జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ కమలాపూర్ మండల సమితి ప్రధాన కార్యదర్శి జక్కుల రాజు గౌడ్, కమలాపూర్ గ్రామ కార్యదర్శి జేరిపోతుల లచ్చయ్య, సీపీఐ సీనియర్ నాయకులు కొలుగూరి బాలరాజు, మండల నాయకులు నాకిర్త ఓదేలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.