📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపెద్ద ఏడ్గీ తాండలో ఇల్లు దగ్ధం..

పెద్ద ఏడ్గీ తాండలో ఇల్లు దగ్ధం..

📰 Generate e-Paper Clip

పెద్ద ఏడ్గీ తాండలో ఇల్లు దగ్ధం..

(25 వేల రూపాయలు నగదు లక్ష రూపాయలు ఆస్తి నష్టం)

వెంటనే స్పందించిన గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్, స్థానికులు కలిసి మంటలు ఆర్పివేత..

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 19

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గీ తాండలో గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ఘటనలో తాండకు చెందిన జాదవ్ గోపాల్ ఇల్లు దగ్ధమైంది. ఇంట్లోని దేవుని గుడిలో వెలుగుతున్న దీపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.. అగ్ని ప్రమాదం సంభవించగానే తాండవాసులు పెద్ద ఏడ్గీ గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ కు సమాచారం అందించారు.. దీంతో ఆయన హుటాహుటిగా తాండకు చేరుకొని వెంటనే ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించారు.. స్థానికుల సహకారంతో మంటలను ఆర్పి వేశారు.. అప్పటికే ఇల్లు సగభాగం కాలిపోయింది.. ఇంట్లో ఉన్న రూ..25000 వేల నగదు తో పాటు బియ్యం, పప్పులు, జొన్నలు, దుస్తులు, ఇతర గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయని ఇంటి యజమాని జాదవ్ గోపాల్ తెలిపారు.. మొత్తం లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు పేర్కొన్నారు.. ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు.. బాధితుడికి నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు భరోసా ఇచ్చారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.