డోర్నకల్‌లో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు
డోర్నకల్, నవంబర్ 19: (ప్రజావాణి)
మహబూబాబాద్ జిల్లా
డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కాల సుమేర్ జైన్, మున్సిపల్ చైర్‌పర్సన్ కొండేటి రాజకుమారి హరినాథ్, వైస్ చైర్‌పర్సన్ మాదా లావణ్య శ్రీనివాస్ ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ దేశ ప్రధానిగా అందించిన సేవలను, దేశ అభివృద్ధి కోసం ఆమె చేపట్టిన కార్యక్రమాలను స్మరించుకున్నారు.
దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, గారే రమేష్, మల్లం ప్రవీణ అనిల్, ప్రమీల రమేష్, నవీన్, రాంకోటి, వీరన్న,సువర్ణ హరికృష్ణ, కో ఆప్షన్ సభ్యులు శీలం భాగ్యలక్ష్మి శ్రీనివాస్, ఖాదర్ బాబా,సొసైటీ డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, వాంకుడోత్ వీరన్న, రెడ్డబోయిన శంకర్, ఏపూరి రమణయ్య, సౌడం మహేష్, ప్రవీణ్ బాబు, నంద,మున్నా,తార సింగ్,వినోద్, రాము,సర్వయ్య,లక్ష్మణ్,గోపి,భద్రం,ఫరిద్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

