📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవేములనర్వ సర్పంచ్ బరిలో టీడీపీ అభ్యర్థిగా చిట్టూరి రమాదేవి..

వేములనర్వ సర్పంచ్ బరిలో టీడీపీ అభ్యర్థిగా చిట్టూరి రమాదేవి..

📰 Generate e-Paper Clip

వేములనర్వ సర్పంచ్ బరిలో టీడీపీ అభ్యర్థిగా చిట్టూరి రమాదేవి.. సుభాష్ సతీమణి నామినేషన్ కు పోటెత్తిన జనం!

వత్సవాయి, నవంబర్ 18 – మన ప్రజావాణి

వత్సవాయి మండలం వేములనర్వ గ్రామ సర్పంచ్ఎన్నికల బరిలో టీడీపీ అభ్యర్థిగా చిట్టూరి రమాదేవి ఈరోజు తన నామినేషన్ దాఖలు చేశారు.

చిట్టూరి సుభాష్ సతీమణి చిట్టూరి రమాదేవి వేములనర్వ నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వత్సవాయి గ్రామపంచాయతీ ఆఫీస్ కు చేరుకుని సంబంధిత అధికారికి సర్పంచ్ నామినేషన్ పత్రాలను అందజేశారు.

నామినేషన్ సందర్భంగా గ్రామం నుంచి పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, పెద్దలు తరలిరావడంతో వత్సవాయి కేంద్రం సందడిగా మారింది. రమాదేవి గెలుపు కోసం ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చినట్లు కనిపించిందని టీడీపీ నాయకులు తెలిపారు.

గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మహిళా సాధికారతే లక్ష్యంగా రమాదేవి సర్పంచ్ బరిలోకి దిగారని, గ్రామ ప్రజల ఆశీస్సులు, మద్దతుతో ఘన విజయం సాధిస్తామని చిట్టూరి సుభాష్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.