📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

📰 Generate e-Paper Clip

*ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు*

• జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా

•ఆందోల్ నియోజకవర్గ ప్రెస్‌మిత్రుల ఐక్యతే నా బలం

• నూతనంగా ఎన్నికైన
ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ప్రదీప్ గౌడ్

జోగిపేట | నవంబర్ 18 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని టీయూడబ్ల్యూజే హెచ్-143, టీఈఎంజేయూ ప్రెస్‌మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు.

గత 12 సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్ర, జిల్లా నాయకత్వాల పిలుపుమేరకు అనేక ఉద్యమాలు, నిరసన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం కృషి చేశాను. టీఈఎంజేయూ ఆందోల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మీ అందరి ఆశీర్వాదంతో బాధ్యతలు చేపట్టి, పెద్దలు, సీనియర్ జర్నలిస్టులు, మీడియా మిత్రుల సహకారంతో యూనియన్‌ను ముందుకు నడిపించడం జరిగింది.

ఈ క్రమంలో నా సేవలను గుర్తించి ఆందోల్ నియోజకవర్గం నుంచి ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా అవకాశం కల్పించడం ఎంతో సంతోషంగా ఉంది. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ఎంపికలో భాగంగా ఆందోల్ నియోజకవర్గం నుంచి ముగ్గురి పేర్లు ప్రతిపాదించగా, సీనియర్ జర్నలిస్టు రాంబాబు అన్న ఇప్పటికే కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మిగిలిన స్థానానికి నేను, పవన్ పోటీలో ఉండగా, నియోజకవర్గ ప్రెస్‌మిత్రులందరూ ఐక్యంగా చర్చించి ఒక్కరే పోటీలో ఉండాలని నిర్ణయించి నన్ను బరిలో నిలపడం అభినందనీయం. తాజాగా ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పత్రికా ప్రకటన ద్వారా తెలియడం ఆనందంగా ఉంది.

ఈ అవకాశం కల్పించడంలో ప్రోత్సహించిన టీయూడబ్ల్యూజే హెచ్-143 రాష్ట్ర కార్యదర్శి, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నగారికి, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నగారికి, యాదగిరి గౌడ్ అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

అలాగే గత 12 సంవత్సరాలుగా జర్నలిస్టు ఉద్యమాల్లో నాతో కలిసి నడిచిన రాంబాబు అన్న, రాజశేఖర్ బాబాయ్, పడిగెల భగత్ అన్న, ఈనాడు సంతోష్, దిశ రాజు, చిన్న సంతోష్, ఫయాక్, నమస్తే తెలంగాణ కుమార్ గౌడ్, టీయూడబ్ల్యూజే హెచ్-143 ఆందోల్ అధ్యక్షులు పవన్‌తో పాటు కాశీనాథ్, శ్రీనివాస్, సందీప్, రాజు, సంజీవ్, శంకు, మధు, నర్సింలు తదితర ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

టీఈఎంజేయూ అధ్యక్షుడిగా ఏ విధంగా మీ అందరికీ అందుబాటులో ఉంటూ సేవలందించానో, అదే విధంగా ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను.

త్వరలో జరగనున్న ఆందోల్ నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నికల్లో అందరం ఐక్యంగా ఉండి మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. టీయూడబ్ల్యూజే హెచ్-143, టీఈఎంజేయూ నూతన కార్యవర్గాలు సమన్వయంతో పనిచేస్తూ జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధన కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.