📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణముదిరాజుల హక్కుల పరిరక్షణకై రాష్ట్రవ్యాప్త ఉద్యమం

ముదిరాజుల హక్కుల పరిరక్షణకై రాష్ట్రవ్యాప్త ఉద్యమం

📰 Generate e-Paper Clip

*ముదిరాజుల హక్కుల పరిరక్షణకై రాష్ట్రవ్యాప్త ఉద్యమం*

*ఘనంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ వార్షికోత్సవ, ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు నిర్వహణ*

*తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య*

* *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*

ముదిరాజుల హక్కుల పరిరక్షణ, రాజకీయ వాటా సాధన, సామాజిక అభ్యున్నతే లక్ష్యంగా ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నామని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య తెలిపారు. 12వ తెలంగాణ ముదిరాజ్ మహాసభ వార్షికోత్సవ వేడుకలు, నవంబర్ 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలో మంగళవారం వేడుకల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొమురయ్య మాట్లాడుతూ,తెలంగాణ ముదిరాజ్ మహాసభ 12వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని నవంబర్ 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి మార్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రశంస పథకాల దినోత్సవాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో 14 శాతం జనాభా కలిగిన ముదిరాజులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు కల్పించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించిన ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. ఇప్పటికే మూడేళ్లు గడిచాయని, ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు. రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్, మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు బండ ప్రకాష్ నాయకత్వంలో ముదిరాజుల హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం కొనసాగుతుందన్నారు. ఈకార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి దబ్బెట తిరుపతి, జిల్లా యువజన అధ్యక్షుడు గరిగె సుమన్ ముదిరాజ్, నాయకులు తూటి రమేష్, నూనె రాజేశం, పంబల పోషం, మంద రమేష్, బొమ్మరవేణి సాయి, రాజేష్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.