IJU రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా రాంచందర్ చారి..! ఘన సన్మానం..
*IJU రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా రాంచందర్ చారి..! ఘన సన్మానం..!* *"నియోజకవర్గ అభివృద్ధికి, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటా" - రాంచందర్ చారి..!* *నారాయణఖేడ్: ప్రజావాణి న్యూస్ ప్రతినిధి బాలరాజు* నారాయణఖేడ్ నియోజకవర్గానికి మరో అరుదైన గౌరవం దక్కింది. సీనియర్ జర్నలిస్టు, నిజాయితీకి, నిక్కచ్చితనానికి మారుపేరైన *IJU రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాంచందర్ చారి* గారు నూతనంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ విషయం తెలియగానే నియోజకవర్గం వ్యాప్తంగా జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. ఆయనకు అభినందనల వెల్లువ కురుస్తోంది....