📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజగన్ కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు

జగన్ కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు

📰 Generate e-Paper Clip

జగన్ కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 15 అమరావతి

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ ఆగ్రహం

రాజకీయాల పేరుతో మహిళల వ్యక్తిత్వ హననం సహించేది లేదు: డా. రాయపాటి శైలజ

వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ తీవ్రంగా ఖండించారు.

ట్విట్టర్ స్పేస్‌లో మహిళలను కించపరిచేలా మాట్లాడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాజకీయాల పేరుతో మహిళలను అవమానించడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం తగదని హెచ్చరించారు.

మహిళల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలను మహిళా కమిషన్ సహించదని, సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.