📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅప్పన్నపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మహిళకు తీవ్ర గాయాలు

అప్పన్నపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మహిళకు తీవ్ర గాయాలు

📰 Generate e-Paper Clip

అప్పన్నపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మహిళకు తీవ్ర గాయాలు!

లారీ కింద పడి నుజ్జునుజ్జయిన వ్యక్తి..

గరిడేపల్లి, నవంబర్ 15 (ప్రజావాణి):

గరిడేపల్లి మండలంలోని అప్పన్నపేట గ్రామ సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హుజూర్‌నగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా, ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఒక వ్యక్తి లారీ కింద పడటంతో తీవ్రంగా నుజ్జునుజ్జయి మృతి చెందినట్లు తెలిసింది. బైక్‌పై ఉన్న మహిళకు తీవ్ర గాయాలతో పాటు కాళ్లకు గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

లారీ డ్రైవర్ మద్యం సేవించి అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మృతుడు, గాయపడిన మహిళ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.