📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణచెట్ల పెంపకంలో నేచర్ కేర్ ట్రస్ట్ కృషి అభినందనీయం..

చెట్ల పెంపకంలో నేచర్ కేర్ ట్రస్ట్ కృషి అభినందనీయం..

📰 Generate e-Paper Clip

చెట్ల పెంపకంలో నేచర్ కేర్ ట్రస్ట్ కృషి అభినందనీయం..
సర్పంచి ప్రశాంత్
ప్రజావాణి,నెల్లికుదురు: పచ్చదనం పెంపొందించడానికి చెట్ల పెంపకంలో నేచర్ కేర్ ట్రస్ట్ కృషి అభినందనీయమని సర్పంచి మాదరి ప్రశాంత్ అన్నారు. మండలంలోని శ్రీ రామగిరి లో నేచర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మొక్కలు నాటారు. దీనికి సర్పంచి మాదరి ప్రశాంత్, నేచర్ కేర్ ట్రస్ట్ చైర్మన్ బండారు శ్రీ వెంకటరమణ తదితరులు హాజరై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి, నేచర్ కేర్ ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో వాహనాలు, పరిశ్రమల సంఖ్య పెరగడంతో పర్యావరణ కాలుష్యం తీవ్రంగా పెరుగుతోందని, అడవుల నరికివేత కారణంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఎల్‌నినో వంటి వాతావరణ పరిణామాలు కూడా మానవ మనుగడకు సవాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా నేచర్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో వీలైనన్ని మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంపొందించడమే తమ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపసర్పంచి రామగిరి సుమన్,ట్రస్ట్ సభ్యులు తోట లాలయ్య, మడత వెంకన్న, గ్రామ పెద్దలు గొల్లపెల్లి ప్రభాకర్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ గుగులోత్ నాగమణి, అంగన్‌వాడీ టీచర్లు గుగులోత్ అరుణ, గుగులోత్ సునీత, మద్దెల సమ్మయ్య, రామగిరి సంతోష్, సంద కృష్ణ, గుర్రాల నరేష్, ఎడ్ల మహేష్, పోతరాజు శ్రీశైలం, పోతరాజు యాకన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.