📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకోర్టు సెలవు... అర్ధరాత్రి కొలువు.

కోర్టు సెలవు… అర్ధరాత్రి కొలువు.

📰 Generate e-Paper Clip

కోర్టు సెలవు… అర్ధరాత్రి కొలువు.

.ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి).

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారింది.
ఎన్నిక పూర్తయ్యేంత వరకు పాత కమిటీయే కొనసాగుతుందని న్యాయస్థానం చెప్పిన తరువాత కూడా, గత చైర్మన్ తనకు అనుకూలంగా తెచ్చుకున్న ఉత్తర్వులు చేతిలో ఉంచుకొని అధికారులు పాత వర్గాన్ని తొలగిస్తూ ప్రత్యక్ష రాజకీయాలకు తెరలేపారు.
ఉత్తర్వులు జారీ చేసి కొత్త వారికి వీరంగం, అది కూడా పట్టపగలు కాకుండా రాత్రి వేళ, రైతులకు, గ్రామ ప్రజలకు ముందస్తు సమాచారం లేకుండా, కేవలం సీలాహో ఎదుటే తతంగం ముగించడం వెనుక ముందస్తు ప్రణాళిక ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
శుక్రవారం తరువాత వచ్చే రెండు రోజులు న్యాయస్థానానికి విరామం కావడంతో గత చైర్మన్ వెంటనే న్యాయం సాధించలేని పరిస్థితి, సోమవారం నాటికి కొత్త వారు బాధ్యతలు తీసుకున్నట్టు కాగితాల్లో నమోదైపోతుందని, ఆ తరువాత అడ్డుకోవడం కష్టమవుతుందని భావించే ఈ సమయాన్ని ఎంచుకున్నారన్న వాదన గ్రామంలో బలంగా వినిపిస్తోంది.
సొసైటీ చట్టం ప్రకారం నిన్నటి వరకు ఓటింగ్ ద్వారానే ఎవరైనా నియామక పద్ధతిలో ఎవరినీ కూర్చోబెట్టకూడదని, గడువు ముగిసినా కొత్త ఎన్నిక వచ్చే వరకు పాత వారే బాధ్యతలు చూసుకోవాలని నిబంధన స్పష్టం చేస్తుండగా, ప్రభుత్వ నియమాకాల బాట పట్టి తనకు అనుకూలమైన వారిని వీలంపై కూర్చోబెట్టేందుకు, రైతుల కోసం పని చేయాల్సిన సంస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని రైతు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది చైర్మన్లు ఇదే అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమ పదవులను కొనసాగించాలని కోరిన నేపథ్యంలో వచ్చిన తీర్పు పాత వారికి ఊరటనిచ్చింది.
న్యాయస్థానం మాట కంటే అధికారుల ఉత్తర్వు గొప్పదా, ఏ ప్రాతిపదికన ఈ ఉత్తర్వు ఇచ్చారు, స్టే విషయం తెలిసి కూడా ఎందుకు ముందుకెళ్లారు, దీని వెనుక అధికార పక్ష పెద్దల ప్రమేయం ఉందా అన్న సందేహాలు ప్రజల్లో చెలరేగుతుండగా, రుణాలు, ఎరువులు, విత్తనాలు, పంట కొనుగోలు లాంటి అత్యంత ముఖ్యమైన సేవలు అందించే సంఘంలో ఇంత కీలక మార్పును రైతులకు తెలియకుండా చీకట్లో చేయడం ఏం సంప్రదాయమని గ్రామస్తులు నిలదీస్తుండగా, ఇది న్యాయస్థానాన్ని అవమానించినట్టే అవుతుందా అన్న చర్చ కూడా మొదలవ్వగా, గత చైర్మన్ సోమవారం మళ్ళీ న్యాయస్థానం మెట్లెక్కి ధిక్కరణ వ్యాజ్యం వేసేందుకు సిద్ధమవుతున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతుండగా, దీనికి ఉత్తర్వు నిలుస్తుందా, హైకోర్టు ఆదేశం నిలుస్తుందా, రాత్రి వేళ జరిగిన ఈ ప్రమాణ స్వీకారాలు చెల్లుబాటు అవుతుందా లేదా అన్నది సోమవారం తేలునుండగా, లక్ష్మీదేవిపేట సొసైటీ వ్యవహారం జిల్లా మొత్తాన్ని కుదిపేస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.