📄 ePaper
Epaper 2
Monday, November 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళను ఇస్తుంది

అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళను ఇస్తుంది

📰 Generate e-Paper Clip

*అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళను ఇస్తుంది*

*ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల సహకారం అందిస్తుంది*

*గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన సర్పంచ్ రాజు*

జహిరాబాద్, నవంబర్ 15 (ప్రజావాణి): అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సహకారన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మొగుడం పల్లి గ్రామ సర్పంచ్ రాజు అన్నారు. అదివారం నాడు గమొగుడం పల్లి మండల కేంద్రానికి చెందిన ఎరుకలి స్వప్న నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకొని గృహ ప్రవేశన్ని పురస్కరించుకొని లబ్ధిదారులతో కలిసి సర్పంచ్ రిబ్బన్ కత్తారించి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు లేనివారికి ఇల్లు నిర్మించుకుంటే వారికీ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సహకారం అందిస్తుందని, రాబోయే రోజుల్లో గ్రామంలో మరిన్ని ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం కృషి చేస్తామని సర్పంచ్ అన్నారు. కార్యక్రమంలో మొగుడం పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పవన్ రాథోడ్, మాజీ మండల అధ్యక్షులు మక్సూద్ ఆహేమద్, సర్పంచ్ రాజు, సీనియర్ నాయకులు విట్టల్ గౌడ్, సర్పంచులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.