📄 ePaper
Epaper 2
Monday, November 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజర్నలిస్టు బచ్చల సుభాష్‌కు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

జర్నలిస్టు బచ్చల సుభాష్‌కు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

జర్నలిస్టు బచ్చల సుభాష్‌కు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
దండేపల్లి, నవంబర్ 15 (ప్రజావాణి):
TUWJ-IJU వర్కింగ్ జర్నలిస్ట్స్ మంచిర్యాల జిల్లా జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బచ్చల సుభాష్‌ను జిల్లా, మండల ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిజం రంగంలో జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, అణగారిన వర్గాల గొంతుకగా నిలుస్తూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.