📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచుక్కల జింక మాంసం అక్రమ రవాణా – ఒక వ్యక్తి అరెస్ట్

చుక్కల జింక మాంసం అక్రమ రవాణా – ఒక వ్యక్తి అరెస్ట్

📰 Generate e-Paper Clip

*చుక్కల జింక మాంసం అక్రమ రవాణా – ఒక వ్యక్తి అరెస్ట్*

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 15

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట అటవీ శాఖ పరిధిలో వన్యప్రాణుల వేట, మాంసం అక్రమ రవాణా మరియు విక్రయాలపై అటవీ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో, 13-11-2026 తేదీన రాత్రి సుమారు 7.00 గంటల సమయంలో అప్పారావుపేట గ్రామ సమీపంలో ఒక వ్యక్తి యాక్టివా ద్విచక్ర వాహనంపై సుమారు 9 కిలోల చుక్కల జింక మాంసాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా అటవీ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి సుమారు 9 కిలోల జింక మాంసాన్ని మరియు సంబంధిత వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.సదరు వ్యక్తిని విచారించగా, సాయి అనే వ్యక్తి తనకు వన్యప్రాణి మాంసాన్ని విక్రయించడానికి ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడించాడు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం కేసు నమోదు చేసి, మాంసం సరఫరా చేసిన వ్యక్తితో పాటు ఇతర సంబంధిత వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నిందితుడిని,జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, కొత్తగూడెం వారి ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం 15 రోజుల రిమాండ్ విధించింది.అనంతరం నిందితుడిని సత్తుపల్లి సబ్ జైలుకు తరలించారు.
ఈ ఆపరేషన్ లో కే . శ్రీను , ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ , దమ్మపేట ; జయరాం , డి వై ఆర్ ఓ ; రామారావు ,ఎఫ్ బి ఓ ; బేస్ క్యాంపు సిబ్బంది నందు , వెంకటేష్. వంశి. మరియు రాంబాబు పాల్గొన్నారు.చుక్కల జింక వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972లోని షెడ్యూల్-II కింద రక్షణ పొందుతున్న వన్యప్రాణి జాతి. వీటిని వేటాడటం, చంపడం, వాటి మాంసాన్ని అక్రమంగా కలిగి ఉండటం, రవాణా చేయడం లేదా విక్రయించడం చట్టప్రకారం శిక్షార్హమైన నేరాలు. అటువంటి నేరాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి.వన్యప్రాణుల సంరక్షణకు ప్రజలు అటవీ శాఖకు సహకరించాలని, ఇలాంటి అక్రమ కార్యకలాపాల సమాచారం ఉంటే వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అన్నారు,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.