📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకార్తీక మాసంలో అన్నపూర్ణేశ్వరునిగా మల్లికార్జున స్వామి దర్శనం!

కార్తీక మాసంలో అన్నపూర్ణేశ్వరునిగా మల్లికార్జున స్వామి దర్శనం!

📰 Generate e-Paper Clip

కార్తీక మాసంలో అన్నపూర్ణేశ్వరునిగా మల్లికార్జున స్వామి దర్శనం!

బీరంగూడ ఆలయంలో ప్రత్యేక పూజలు,అభిషేకాలు

భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం

అమీన్‌పూర్, నవంబర్ 13 (ప్రజావాణి): కార్తీక మాసం తొలి శుక్రవారం సందర్భంగా బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకే ఆలయ ద్వారాలు తెరవగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవి, సంగమేష్ వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి, భ్రమరాంబిక అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం కార్తీక మాసం ప్రత్యేకతను చాటుతూ మల్లికార్జున స్వామివారికి అన్నాభిషేకం చేసి, వివిధ రకాల అన్నపదార్థాలతో విశేషంగా అలంకరించారు. అన్నపూర్ణేశ్వరుని రూపంలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వడంతో భక్తులు పరవశించిపోయారు.
హరహర మహాదేవ.. శంభో శంకర నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు. అనంతరం శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని విశేషంగా అలంకరించి లలితా సహస్రనామార్చనలు నిర్వహించారు. మహిళా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.కార్తీక మాసంలో అన్నాభిషేకం, అన్నపూర్ణేశ్వరుని విశేష దర్శనం లభించడంతో బీరంగూడ ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అన్నమే పరబ్రహ్మ స్వరూపమనే సందేశాన్ని చాటుతూ జరిగిన ఈ ప్రత్యేక పూజలు భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.