📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు కాలభైరవ స్వామి ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానం

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు కాలభైరవ స్వామి ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానం

📰 Generate e-Paper Clip

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు కాలభైరవ స్వామి ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానం

బెజ్జంకి,నవంబర్ 13 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలోని శ్రీ స్వయంభు కాలభైరవ అధిష్ఠాన ప్రత్యంగిరా దేవి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ కాలభైరవ స్వామి ప్రతిష్ట మహోత్సవానికి హాజరు కావాలని కోరుతూ మానకొండూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్కు ఆలయ కమిటీ నిర్వాహకులు ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమ వివరాలను డాక్టర్ రసమయి బాలకిషన్‌కు వివరించి, కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లింగాల లక్ష్మణ్, యాదవ సంఘం మండల అధ్యక్షులు నలువాల స్వామి యాదవ్, యాదవ యువజన సంఘం అధ్యక్షులు కల్లూరి అజయ్ యాదవ్, ఏలా శేఖర్ బాబు, కుంభం రవి, గొల్లపల్లి ఎల్లయ్య, అమ్ముల రాములుతో పాటు ఆలయ కమిటీ నిర్వాహకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.