📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనాగదేవత ఆశీస్సులతో హాసన్‌పర్తి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి

నాగదేవత ఆశీస్సులతో హాసన్‌పర్తి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి

📰 Generate e-Paper Clip

నాగదేవత ఆశీస్సులతో హాసన్‌పర్తి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి!

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి జరుపుకోవాలి.. 66వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్

హాసన్‌పర్తి, నవంబర్ 13, మన ప్రజావాణి :

హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ పరిధిలోని హాసన్‌పర్తి 66వ డివిజన్‌లో నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని పాపిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్‌తో పాటు డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గొర్రె కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైన నాగుల పంచమి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. నాగదేవతను ఆరాధించడం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు.

నాగుల పంచమి పర్వదినం సందర్భంగా ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. హాసన్‌పర్తి 66వ డివిజన్ ప్రజలందరూ సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ నాగుల పంచమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.