📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఅటకెక్కిన అల్పాహార పథకం

అటకెక్కిన అల్పాహార పథకం

📰 Generate e-Paper Clip

*అటకెక్కిన అల్పాహార పథకం!*

*నాలుగు నెలలకే నిలిచిన ముఖ్యమంత్రి ప్రారంభించిన కార్యక్రమం*

రంగారెడ్డి జిల్లా నవంబర్ 13 (ప్రజావాణి): మంచాల మండలం ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన అల్పాహార పథకం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం కొద్దికాలానికే నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతిరోజూ ఉదయం దోశ, ఇడ్లీ, ఉప్మా, పాలు అందించాల్సి ఉండగా ప్రస్తుతం అల్పాహారం అందడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో అల్పాహారం అందుతుందనే నమ్మకంతో ఇంటి వద్ద తినకుండా వస్తున్న విద్యార్థులు ఆకలితో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి అల్పాహార పథకాన్ని పునరుద్ధరించి విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టికాహారం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

పథకాలు ప్రారంభించడమే కాదు.. వాటిని నిరంతరం అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే! మధ్యాహ్నం భోజనంతో పాటు సాయంత్రం కూడా స్నాక్స్ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.