📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఅనారోగ్య బాధితులకు అండగా ప్రజా ప్రభుత్వం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

అనారోగ్య బాధితులకు అండగా ప్రజా ప్రభుత్వం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

📰 Generate e-Paper Clip

అనారోగ్య బాధితులకు అండగా ప్రజా ప్రభుత్వం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

దేవరుప్పుల మండలంలో 23 మందికి రూ.11.17 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 12 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలంలో వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అందజేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 23 మంది బాధితులకు మొత్తం రూ.11,17,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం క్యాంపు ఆఫీస్ లోఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్యం వచ్చినప్పుడు వైద్య ఖర్చులు పెద్ద భారంగా మారుతాయని, అలాంటి కష్ట సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ బాధిత కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తోందని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరికీ మెరుగైన వైద్యం అందకుండా ఉండకూడదనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ సహాయం అందిస్తోందని తెలిపారు.

ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, నిరుపేద కుటుంబాలకు వైద్యపరంగా భరోసా కల్పించేందుకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయాన్ని అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.

పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దావెరా అనిల్, జిల్లా నాయకుడు కాసారపు ధర్మారెడ్డి, దేవరుప్పుల సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి, మండల కార్యదర్శి మాసంపెల్లి మహేందర్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ మాసంపల్లి సాత్విక్, కడవెండి గ్రామ పార్టీ అధ్యక్షుడు చెన్నూరి రాంబాబు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.