📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఅంగన్వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ

అంగన్వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ

📰 Generate e-Paper Clip

*అంగన్వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ*

రాయికల్; నవంబర్ 12 (ప్రజావాణి)

రాయికల్ మండలంలోని అల్లీపూర్ సెక్టార్ పరిధిలోని ఆలూరు,అయోధ్య, రాజునాయక్ తండా గ్రామాల్లోని 5 అంగన్వాడీ కేంద్రాలను బుధవారం సీడీపీఓ జయప్రద, సూపర్వైజర్ రాధ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లోని రిజిస్టర్లు, చిన్నారుల హాజరు శాతాన్ని పరిశీలించారు. ఎప్పటికప్పుడు చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు ప్రభుత్వం నుంచి మంజూరయ్యే పోషకాహారాన్ని పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అయోధ్యలో గర్భిణీలు, బాలింతలు, పిల్లల తల్లులకు ఆహార, ఆరోగ్య విషయాలపై, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు.అయోద్య 1వ అంగన్వాడీ కేంద్రంలో పోషణ వాటికలో మందులు లేకుండా సేంద్రియ ఎరువులు వాడి కూరగాయలు, ఆకుకూరలు పెంచి వంటలో ఉపయోగించాలని కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలూరు కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు సిలబస్ ప్రకారం నేర్పాల్సిన కార్యక్రమాలను చేసి చూపిస్తూ టీచర్లతో చేయించారు.రాజు నాయక్ లంబాడి తండాలో రేపు నాగుల చవితి ఉన్నందున అంగన్వాడీ కేంద్రంలో వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మధుర, స్నేహలత, గోదావరి, సుజాత, ప్రమీల, ఆయాలు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.