📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసేంద్రీయ సాగు చేపట్టాలి ఆరుతడి పంటలు వేయాలి

సేంద్రీయ సాగు చేపట్టాలి ఆరుతడి పంటలు వేయాలి

📰 Generate e-Paper Clip

సేంద్రీయ సాగు చేపట్టాలి ఆరుతడి పంటలు వేయాలి

ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరిలో మండల వ్యవసాయ శాఖ ఏవో భూక్య మహేందర్ ఆధ్వర్యంలో కేత్ బచావో అభియాన్,ఎల్ని నో లపై రైతులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి స్థానిక సర్పంచి మాదరి ప్రశాంత్ అధ్యక్షత వహించారు. రైతుల అధిక సంఖ్యలో హాజరయ్యారు.

*ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి:సర్పంచి*

స్థానిక సర్పంచి మాదరి ప్రశాంత్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం తో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని,వ్యవసాయ శాఖ,ప్రభుత్వ సూచన మేరకు రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు.

*కేత్ బచావో అభియాన్పై వివరించిన ఏవో..*

ఎం ఏ ఓ మహేందర్ రైతులకు కేత్ బచావో అభియాన్ పై అవగాహన కల్పిస్తూ భూసారా పరిరక్షణ అవశ్యకత,సేంద్రీయ ఎరువుల వాడకం, ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత,యాసంగి లో సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల రైతాంగం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు వరి పంట ను తగ్గించి అపరాలు మినుములు,పెసలు,జొన్నలు వంటి ఆరు తడి పంటలు సాగు చేపట్టాలని సలహా ఇచ్చారు.
కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రామగిరి సుమన్, ఏఈఓ ప్రతిభ, పంచాయతీ సెక్రటరీ, సిహెచ్ మౌనిక, పిఎసిఎస్ సీఈవో కత్తుల వెంకన్న, డైరెక్టర్లు మద్దెల సమ్మయ్య, బెల్లి నర్సయ్య,
రైతులు,అనుముల రవీందర్, బొమ్మిడీ వినోద్ రెడ్డి,గుర్రాల నరేష్, పోతారాజ్ యాకన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.